Home » ఉపరాష్ట్రపతికి ‘అమరావతి’ పుస్తకం అందజేసిన టీడీపీ ఎంపీలు

ఉపరాష్ట్రపతికి ‘అమరావతి’ పుస్తకం అందజేసిన టీడీపీ ఎంపీలు

by TaajaVartha
TDP MPs Present 'Amaravati' Book to Vice President C.P. Radhakrishnan

New Delhi: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందం, అమరావతి రాజధాని చరిత్ర మరియు ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన “Amaravati: Built by the People, Secured by Destiny” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేసింది.

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల స్ఫూర్తి నుంచి రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు సుదీర్ఘంగా 1,631 రోజుల పాటు సాగించిన పోరాట పరిణామాలను ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. అలాగే 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక ఘట్టాలను ఇందులో పొందుపరిచినట్లు ఎంపీలు వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వం, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వ పూర్తి మద్దతుతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00