Home » రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

by TaajaVartha
ABVP Calls for Statewide Colleges Bandh Tomorrow in Andhra Pradesh

Palnadu Ditrict: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5 (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏబీవీపీ నాయకుడు తీగల రాకేష్ డిమాండ్ చేశారు.

రూ.6,800 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వివాదాస్పద జీవో 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింపజేయాలని వారు కోరారు. ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించడం, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి నాణ్యమైన ఆహారం అందించడం, జూనియర్ కాలేజీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ బంద్‌కు విద్యార్థులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00