Palnadu District: పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ( Mla Julakanti Bramhananda Reddy ) పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలలో అందించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, మాచర్లలోని స్థానిక కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఎమ్మెల్యే విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి వినియోగదారులకు బియ్యం ప్యాకెట్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ బృహత్తర నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతు బజార్లు, ప్రభుత్వంచే గుర్తించబడిన రైస్ మిల్లుల ద్వారా బీపీటీ స్టీమ్ రైస్ కిలో రూ. 52 మరియు బీపీటీ రా రైస్ కిలో రూ. 50 చొప్పున ప్రజలకు అందజేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమతూకంతో ముందంజ వేస్తున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ CSDT బాషా, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ యాదవ్ మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులు యాంగటి మల్లికార్జునరావు, మద్దిగపు వెంకటరామిరెడ్డి, యొనుముల కేశవరెడ్డి, కజ్జం సైదయ్య, యలమంద, కంభంపాటి అనిల్ కుమార్, సంభోజు వేణు, పులుసు రఘు, ఓర్సు కాంతి కుమార్, చంటి, గణేష్, అన్వర్, గరిణే శ్రీను, పినిశెట్టి కృష్ణ, మాదినేటి శాంతి, వేముల మంగమ్మ, నాగమణి, అనురాధ, దుర్గా, లక్ష్మీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
