2024లో తగ్గాం.. ఇప్పుడు తగ్గేదే లేదు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీట్ల సర్దుబాటు, పోటీ విషయంలో జనసేన పార్టీ ఈసారి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.