రెండు దీవులు.. 3,500 జనాభా.. శతాబ్దాల పోరాటం
అంతర్జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న అత్యంత వివాదాస్పద భూభాగ పోరాటాల్లో ‘ఫాక్‌లాండ్స్ దీవుల వివాదం’ ఒకటి. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న ఈ దీవుల సార్వభౌమాధికారం (Ownership) కోసం బ్రిటన్, అర్జెంటీనా దేశాల మధ్య కొన్ని శతాబ్దాలుగా దౌత్యపరమైన, సైనికపరమైన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.