Home » AP Cabinet Changes: దసరాకి ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఖాయం?

AP Cabinet Changes: దసరాకి ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఖాయం?

by TaajaVartha
AP Cabinet Reshuffle by Dasara? Chandrababu and Nara Lokesh Likely to Take Key Decision

AP Cabinet Changes: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయ్యాయి. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్సార్‌సీపీ (ysrcp) అసలు కోలుకుంటుందా లేదా అనుకున్న తరుణంలో, ఊహించని విధంగా వైసీపీ కేడర్ మళ్లీ రోడ్లెక్కి కూటమి ప్రభుత్వంతో ‘ఢీ అంటే ఢీ’ అంటోంది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రతిపక్షం ఇంత వేగంగా పుంజుకోవడానికి కూటమి లోపాలు, ఎమ్మెల్యేల తీరే కారణమనే చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే దసరాకు కేబినెట్ ప్రక్షాళన ఖాయమనే ప్రచారం సంచలనం సృష్టిస్తోంది.

ఆ 13 మంది కొత్త మంత్రుల తీరే కారణమా?
ఈసారి సీఎం చంద్రబాబు (chandrababu) తన మంత్రివర్గంలో ఎక్కువ భాగం కొత్త ముఖాలకే అవకాశమిచ్చారు. టీడీపీ నుంచి మంత్రి పదవులు చేపట్టిన వారిలో ఏకంగా 13 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే కావడం గమనార్హం. అయితే అనగాని సత్యప్రసాద్ (anagani Satya prasad), వంగలపూడి అనిత (vangalapudi Anitha), పయ్యావుల కేశవ్ (payyavula Keshav), గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar), మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (mandipalli ramprasad Reddy), కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas), సుభాష్ (Vasamsetti Subhash), సవిత (savitha), టి జి భరత్ (TG Bharath), బి సి జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), గుమ్మడి సంధ్యా రాణి (Gummidi Sandhyarani), డోలా బాల వీరాంజనేయ స్వామి (dola Vala veeranjaneya Swami)లలో సగానికి పైగా మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీరు తమ శాఖలపై పట్టు సాధించడంలోనూ, పార్టీకి అండగా నిలవడంలోనూ విఫలమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, ఆర్థిక శాఖల తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొంది.

దసరా నాటికి ‘కేబినెట్’ ప్రక్షాళన!
జిల్లాల స్థాయిలో పవర్‌ఫుల్ లీడర్లు లేకపోతే అది ప్రాంతీయ అభివృద్ధిపైనే కాకుండా పార్టీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మంత్రుల పనితీరుపై చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) ఇద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని సీనియర్లు భావిస్తున్నారు. దీంతో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే, రాబోయే దసరా నాటికి కేబినెట్‌ (Andhra Pradesh Cabinet)లో భారీ మార్పులు చేపట్టి.. తొలివిడతలో అవకాశం దక్కని సీనియర్లకు స్థానం కల్పించాలని అధిష్టానం యోచిస్తోంది.

కూటమికి మైనస్‌గా మారుతున్న అంతర్గత విభాగాలు
ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా కూటమికి ప్రతికూలంగా మారుతున్నాయి. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో వైసీపీ నేతలు చెప్పిన వారికే ప్రాధాన్యత దక్కుతోందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టీజీ భరత్ వివాదరహితుడే అయినప్పటికీ, ఆయన శాఖపై ఆయనకు గ్రిప్ లేదనే టాక్ సచివాలయ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా ఆ క్రెడిట్ అంతా లోకేష్ ఖాతాలోకి వెళ్తోందని, కొన్ని పరిశ్రమల ప్రారంభోత్సవాలకు కనీసం సంబంధిత మంత్రికి ఆహ్వానం కూడా అందడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు.

వైసీపీ పుంజుకోవడానికి కారణమిదేనా?
మంత్రుల పనితీరులో లోపాలు, హామీల అమలులో ఆలస్యం, అధిష్టానం మాట వినని ఎమ్మెల్యేల తీరు.. ఇవన్నీ రెండేళ్లలోనే వైసీపీకి మళ్లీ అవకాశాన్ని ఇచ్చాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకే చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. మరి దసరాకు జరగబోయే ఈ ప్రక్షాళనతోనైనా కూటమి ప్రభుత్వం అనుకున్న ట్రాక్‌లోకి వస్తుందో లేదో చూడాలి!

 

ఇది చదవండి.. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు బిగ్ టాస్క్..?

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00