Home » ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

by Veeresh Tammali
The Real Reason You Check Your Phone Every Morning Will Surprise You

Phone Habit: ఉదయం కళ్లు తెరిచిన 10 సెకన్లలోనే ఫోన్ చూస్తున్నారా? WhatsApp ఓపెన్ చేయకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్.. Instagram చూడకపోతే రోజు స్టార్ట్ కానట్టే అనిపిస్తుందా? మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయ్యారని అనుకుంటున్నారా? కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ అనుకుంటే పొరపాటే. అసలు నిజం తెలిస్తే మీ ఆలోచనే మారిపోతుంది. మీ గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకోవాల్సిందే.

మీ బ్రెయిన్ చేస్తున్న ‘సీక్రెట్ గేమ్’ ఇదే!
రాత్రంతా మీరు నిద్రలో ఉంటారు. కానీ ప్రపంచం మాత్రం ఆగదు. కొత్త మెసేజ్‌లు, బ్రేకింగ్ న్యూస్, ఆఫీస్ ఈమెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి మీ మెదడులో మొదలవుతుంది. దీనినే సైకాలజీలో ‘Uncertainty Reduction’ అంటారు. అంటే.. “ఏం మిస్ అయ్యానో వెంటనే తెలుసుకోవాలి అనే సహజ స్పందన.

అసలు విలన్… మీ అలవాటు
మొదట్లో ఫోన్ చూడటం ఒక నిర్ణయం. కానీ ప్రతిరోజూ అదే పని చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ హ్యాబిట్‌గా మారిపోతుంది. నిద్రలేవడం ఒక సిగ్నల్… ఫోన్ తీసుకోవడం ఒక రొటీన్… కొత్త మెసేజ్ లేదా రీల్ కనిపించడం ఒక రివార్డ్. ఈ మూడు కలిసి మీ బ్రెయిన్‌లో Habit Loopను క్రియేట్ చేస్తాయి.

ఎందుకు మళ్లీ మళ్లీ ఫోన్ ఓపెన్ చేస్తారు?
ప్రతిసారీ ఏదో పెద్ద విషయం ఉండదు. కానీ ఈసారి ఏముందో? అనే చిన్న క్యూరియాసిటీ చాలు. ఒక లైక్, ఒక మెసేజ్, ఒక వైరల్ వీడియో… ఎప్పుడు ఏది వస్తుందో తెలియకపోవడమే బ్రెయిన్‌ను మళ్లీ మళ్లీ ఫోన్ వైపు లాగుతుంది. దీనినే నిపుణులు Variable Reward అంటారు.

ఇది కేవలం టైమ్‌పాస్ కాదు!
ఉదయం టైమ్ ఎంతైంది? వాతావరణం ఎలా ఉంది? ఎవరైనా కాల్ చేశారా? ఈరోజు షెడ్యూల్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుని రోజును ప్రారంభించడానికి కూడా చాలామంది ఫోన్ చూస్తారు. అంటే ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు… ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ అయ్యే ప్రక్రియ.

కానీ ఇక్కడే ఉంది అసలు డేంజర్!
ఫోన్ చూడటం సమస్య కాదు. కానీ “ఒక్క నిమిషం” అనుకుని 40-45 నిమిషాలు రీల్స్, పోస్టులు స్క్రోల్ చేస్తే… అక్కడి నుంచే అసలు నష్టం మొదలవుతుంది. మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, మూడ్ దెబ్బతింటుంది, రోజంతా ఫోకస్ కూడా తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఫోన్ చూడటం అంటే మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ అడిక్ట్ అన్న మాట కాదు. కానీ ఫోన్‌ను మీరు కంట్రోల్ చేస్తున్నారా… లేక ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? అదే అసలు ప్రశ్న.

ఇది చదివారా? దాని కోసం నా డాగ్ ని వాడతానంటున్న కుస్తీ భామ..!

 

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00