నేటి రాశిఫలాలు (20-07-2026)

daily horoscope for july 20th 2026 monday in telugu

నేటి పంచాంగం, గ్రహస్థితుల ఆధారంగా 12 రాశుల వారి జాతక వివరాలు ఇక్కడ చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఏ దైవారాధన శుభప్రదం అనే విశేషాలు మీకోసం..

మేషం (Aries)
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన విజయాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.

పరిహారం: శివపార్వతుల ఆరాధన శుభప్రదం.

వృషభం (Taurus)
అనుకూల పరిస్థితులు ఏర్పడి శుభవార్తలు వినే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలులో లాభదాయక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది.

పరిహారం: ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini)
ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. సహచరుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరమైన సమయంలో తోడ్పాటు లభిస్తుంది.

పరిహారం: ఇష్టదేవతా శ్లోకం పఠిస్తే మంచిది.

కర్కాటకం (Cancer)
కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి.

పరిహారం: దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

సింహం (Leo)
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశాజనక ఫలితాలు కనిపిస్తాయి. గౌరవ, ప్రతిష్టలు పెరిగే సూచనలున్నాయి. మిత్రుల ప్రోత్సాహం ఉత్సాహాన్ని పెంచుతుంది.

పరిహారం: రవి ధ్యానం శ్రేయస్కరం.

కన్య (Virgo)
మనశ్శాంతితో వ్యవహరించి అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

పరిహారం: దుర్గాదేవి స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

తుల (Libra)
ఆత్మస్థైర్యంతో వ్యవహరించి క్లిష్ట పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది.

పరిహారం: శివ అష్టోత్తర శతనామావళి పఠనం శుభదాయకం.

వృశ్చికం (Scorpio)
అవసరానికి అన్ని అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులతో అనుబంధం మరింత బలపడుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

పరిహారం: ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius)
ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని పలువురు ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన విషయాలను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

పరిహారం: శని ధ్యానం శ్రేయస్కరం.

మకరం (Capricorn)
అవరోధాలు ఎదురైనా సహనంతో వాటిని అధిగమిస్తారు. శారీరక అలసట పెరగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

పరిహారం: చంద్రశేఖరాష్టకం పఠనం శాంతిని ప్రసాదిస్తుంది.

కుంభం (Aquarius)
పనిభారాన్ని సమతుల్యంగా నిర్వహించడం అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో మితవ్యయం పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces)
ఆర్థికంగా ఒక శుభ పరిణామం ఆనందాన్ని కలిగిస్తుంది. భవిష్యత్ లక్ష్యాల దిశగా అడుగులు వేయగలుగుతారు. గృహ సంబంధిత పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

పరిహారం: దుర్గా ధ్యానం శుభప్రదం.

గమనిక: ఈ రాశిఫలాలు కేవలం సమాచారం, నమ్మకాలపై ఆధారపడి ఇవ్వబడినవి. మీ వ్యక్తిగత జాతక వివరాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు.

Related posts

నేటి పంచాంగం (24-07-2026, శుక్రవారం )

నేటి పంచాంగం (23-07-2026, గురువారం)

నేటి పంచాంగం (21-07-2026, మంగళవారం)