Home » రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?

రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?

by TaajaVartha
Kadambari Jethwani Case

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh)  ముంబై నటి కాదంబరి జెత్వానీ (Kadamabari Jethwani) ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు ఒక వర్గానికి ఆమె పెద్ద బాధితురాలు. అంతకు ముందు ఇంకో వర్గానికి ఆమె నిందితురాలు.. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అటు వైసీపీ (ysrcp), ఇటు కూటమి ప్రభుత్వాల (kutami Govt)  తీరు ‘దొందు దొందే’ అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

రాజకీయ చదరంగంలో జెత్వానీ ఒక పావు మాత్రమేనా?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జెత్వానీని ఒక నిందితురాలిగా చూపిస్తూ కేసులు నమోదు చేసి, ఆమెను ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీన్ మొత్తం రివర్స్ అయింది. వైసీపీ హయాంలో నిందితురాలిగా ఉన్న జెత్వానీ ఆతర్వాత బాధితురాలిగా మారిపోయారు. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గరి నుంచి అనుకూల మీడియా వరకు అందరూ ఆమె పట్ల విపరీతమైన సానుభూతి చూపించారు. వైసీపీ హయాంలో ఆమెకు ఎంతటి ఘోర అవమానం జరిగిందో, పోలీసులు ఆమెను ఎలా వేధించారో కథలు కథలుగా చెప్పుకొచ్చారు.

సీఐడీ ఛార్జ్ షీట్‌తో  (CID Charge sheet) ఊహించని ట్విస్ట్
ఇంతలో ఏమైందో ఏమో గానీ, జెత్వానీ వ్యవహారంలో సడెన్‌గా పెద్ద బ్లాస్టింగ్ ట్విస్ట్ ఎదురైంది. జెత్వానీకి న్యాయం చేస్తామంటూ ఆమె ఫిర్యాదుల ఆధారంగా యాక్షన్ మోడ్‌లోకి దిగిన ప్రభుత్వం.. ఇప్పుడు హఠాత్తుగా సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆమెను మళ్లీ నిందితురాలిగానే చేర్చడం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది.

మొన్నటి వరకు బాధితురాలిగా కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను, మళ్లీ నిందితురాలిగా మార్చడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పరిణామంతో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇద్దరూ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే జెత్వానీని పావుగా వాడుకున్నారా? అన్న అనుమానాలు సామాన్యుల్లో సైతం మొదలయ్యాయి.

రాజకీయ నాటకంలో సస్పెండయిన ఐపీఎస్‌ల సంగతేంటి?
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దారుణంగా నలిగిపోయింది మాత్రం పోలీసు బాసులే. నాడు వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఆదేశాలతో జెత్వానీని ఆఘమేఘాలపై తీసుకువచ్చి అరెస్టు చూపకుండా బంధించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం రాగానే, జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను (IPS Suspensions AP) సస్పెండ్ చేశారు. ఇప్పటికీ వారి సస్పెన్షన్ గడువు పొడగిస్తూనే వస్తున్నారు. తాజాగా జెత్వానీనే కుక్కల విద్యాసాగర్ ను (Kukkala Vidya Sagar) బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసిందంటూ సీఐడీ వెల్లడించడం కొసమెరుపు.

మొత్తానికి కాదంబరి జెత్వానీ అసలు నిందితురాలా? బాధితురాలా? లేక రెండు పార్టీల పొలిటికల్ మైండ్ గేమ్‌లో బలిపశువా? అన్నది తేలాలి.

మరోవైపు వైసీపీ హయాంలో కాదంబరి జెత్వానీ తనను బెదిరించి, మోసం చేసి డబ్బులు వసూలు చేసిందంటూ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ స్థాయి అధికారులు ఆఘమేఘాల మీద ముంబైకి వెళ్లి రాత్రికి రాత్రి జెత్వానీని అరెస్టు చేసి తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చకుండా నిబంధనలకు విరుద్ధంగా గెస్ట్ హౌస్ లో నిర్భంధించడం ఒక కేసు అని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో పోలీసులు వేధించిన తీరుపై జెత్వానీ చేసిన ఫిర్యాదు రెండూ వేర్వేరు కేసులుగా చూడాలని కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన.

Kadambari Jethwani Case Takes a U-Turn CID Charge Sheet Pushes Alliance Govt into Defense

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00