కూటమి ప్రభుత్వ పాలన సూపర్‌ హిట్: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారంలో ఎమ్మెల్యే జూలకంటి!

Mla Julakanti Brahmananda Reddy Leads 'Intintiki TDP' Campaign in Macherla Town

Palnadu District: సంక్షేమ పథకాల వరద, అభివృద్ధి పనుల వేగం చూసిన ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలన ‘సూపర్‌ హిట్’ అని కొనియాడుతున్నారని మాచర్ల ( macharla ) శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ( Julakanati Bramhananda Reddy ) హర్షం వ్యక్తం చేశారు.  మాచర్ల పట్టణంలో కూటమి నాయకులు, శ్రేణులు నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పట్టణంలోని 17, 18 ,  14, 15 వార్డులలో ఈ ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వార్డులలో పర్యటించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే జూలకంటికి స్థానిక మహిళలు, ప్రజలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లభించిన సాదర ఆదరణ నడుమ ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీల మేరకు అందించిన సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ యాదవ్, కూటమి పార్టీల ముఖ్య నాయకులు యాంగటి మల్లికార్జునరావు, మద్దిగపు వెంకటరామిరెడ్డి, యొనుముల కేశవరెడ్డి, కజ్జం సైదయ్య, యలమంద, కంభంపాటి అనిల్ కుమార్, సంభోజు వేణు, పులుసు రఘు, ఓర్సు కాంతి కుమార్, చంటి, గణేష్, అన్వర్, వజ్రం నాయర్, గరిణే శ్రీను, పినిశెట్టి కృష్ణ, మాదినేటి శాంతి, వేముల మంగమ్మ, నాగమణి, అనురాధ, దుర్గా, లక్ష్మీ తదితర నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నరసరావుపేట మున్సిపల్ రేసు: నోటిఫికేషన్ రాకముందే ‘సెల్ఫ్’ ప్రచారాల హోరు!

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

గురజాలలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’: 26 వాహనాలు స్వాధీనం!