Home » మెదడుకు AI తో మతిమరుపు

మెదడుకు AI తో మతిమరుపు

by Veeresh Tammali
Using ChatGPT, Claude & Gemini Too Much? Here's Why You Should Be Careful

కాలేజ్ అసైన్మెంట్ అయినా సరే, చిన్న డౌట్ వచ్చినా సరే మన జెన్ జీ (Gen Z) యూత్ ఫస్ట్ ఆప్షన్ చాట్ జీపీటీ (ChatGPT) లేదా జెమినీ (Gemini). ఈ ఏఐ (AI) టూల్స్ మన పనులను ఈజీ చేస్తున్న మాట నిజమే కానీ, వీటి వాడకం మితిమీరితే ఫ్యూచర్ లో డెమెన్షియా అంటే మెమరీ లాస్ (Memory loss) ముప్పు గ్యారెంటీ అని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా బుర్రకు పని చెప్పకుండా మొత్తం టెక్నాలజీకి అప్పగించడాన్ని కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ (Cognitive offloading) అంటారని, దీనివల్ల మెదడు మొద్దుబారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రీసెర్చ్ లో షాకింగ్ నిజాలు
ఇటలీ ప్రొఫెసర్ సిమోన్ రోస్సీ చేసిన స్టడీలో బ్రెయిన్ డ్యామేజ్ పై దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. స్టూడెంట్స్ ను రెండు గ్రూపులుగా విడదీసి ఎస్సేలు రాయించగా, ఏఐ (AI) టూల్స్ వాడిన కుర్రాళ్లకు తాము ఏం రాశామో కూడా తర్వాత గుర్తులేకపోవడం రీసెర్చర్లను షాక్ కు గురిచేసింది. అదే సొంతంగా బుర్రపెట్టి రాసిన వాళ్ల మెదడు చాలా యాక్టివ్ గా పనిచేయడంతో పాటు రాసిన మ్యాటర్ అంతా పక్కాగా గుర్తుపెట్టుకున్నారు. క్రిటికల్ థింకింగ్ (Critical thinking) స్కిల్స్ ను టెక్నాలజీ తీవ్రంగా దెబ్బతీస్తుందని ఈ ప్రయోగంతో క్లియర్ గా తేలిపోయింది.

అయితే ఏఐ (AI) టెక్నాలజీ వాడటం పూర్తిగా తప్పు కాదని, దాన్ని మన మెదడుకు రీప్లేస్ మెంట్ లా కాకుండా ఒక అసిస్టెంట్ లా మాత్రమే వాడుకోవాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఫోన్ తీసి సెర్చ్ చేసే బదులు, ముందు మన సొంత నాలెడ్జ్ వాడితే మెదడుకు కావాల్సిన నాచురల్ వ్యాయామం దొరుకుతుంది. అప్పుడే మన మెంటల్ హెల్త్ (Mental health) సేఫ్ గా ఉంటుందని, లేదంటే రాబోయే రోజుల్లో చిన్న విషయాలు కూడా మర్చిపోయి గోడకు కొట్టుకోవాల్సి వస్తుందని యూత్ కు గట్టిగా సూచిస్తున్నారు.

 

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00