LinkedIn Report says Visakhapatnam as the top fastest-growing non-metro city in India for employment and migration
LinkedIn report: మెట్రో నగరాల్లో ఉద్యోగం అంటేనే రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జ్యామ్‌లు, కొండెక్కి కూర్చున్న రెంట్లు, అస్సలు తగ్గని లివింగ్ కాస్ట్! కానీ ఇప్పుడు సీన్ మెల్లగా మారుతోంది. ఐటీ అనగానే బెంగుళూర్ (Bangalore) , హైదరాబాద్ (Hyderabad) లేదా చెన్నై (chennai) బాట పట్టే రోజులకు ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ఇన్’ (LinkedIn) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం… భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-మెట్రో నగరాల (Non Metro Cities) జాబితాలో మన విశాఖపట్నం (Vizag) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది!
జాబ్ క్రియేషన్ (Job Creation), ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్ మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకోవడంలో (Migration) వైజాగ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ లింక్డ్ఇన్ జాబితాలో విశాఖ తర్వాత లుథియానా (Luthiana), సూరత్ (surat) , వడోదర (Vadodara), ప్రయాగ్‌రాజ్ (prayagraj) వరుసగా టాప్-5 స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు కేవలం సీ సైడ్ బ్యూటీకి, పోర్ట్ రంగానికి మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వైజాగ్, ఇప్పుడు గ్లోబల్ కంపెనీలకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారిపోతోంది.
ఒట్టి పోర్ట్ సిటీ మాత్రమే కాదు… ఇప్పుడది ‘నెక్స్ట్-జెన్ టెక్ హబ్’!
గతంలో విశాఖపట్నం అనగానే మనకి వైజాగ్ పోర్ట్, ఫార్మా కంపెనీలు, లేదా స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రధానంగా గుర్తొచ్చేవి. కానీ ఈ రోజు వైజాగ్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సంప్రదాయ పరిశ్రమలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), భారీ డేటా సెంటర్లు (Data Center) , ఐటీ సెజ్‌లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కటింగ్-ఎడ్జ్ రంగాలు విశాఖలో వేగంగా విస్తరిస్తున్నాయి. కోడింగ్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రతీ సెక్టార్‌లో భారీగా పెట్టుబడులు తరలివస్తుండటంతో, విభిన్న నైపుణ్యాలు ఉన్న యంగ్‌స్టర్స్‌కి వైజాగ్ ఒక మల్టీ-సెక్టార్ జాబ్ మార్కెట్‌గా డెవలప్ అవుతోంది.
ఇది చదివారా..? ఒకడు రాక్షసుడు.. ఒకడు రక్షకుడు.. ఇద్దరూ హైదరాబాద్ వాళ్లే..!
టైట్ జాబ్ మార్కెట్ & పెరిగిన కాంపిటీషన్… బట్ వైజాగ్ ఈజ్ ఏ సేవియర్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌లో కాంపిటీషన్ పీక్స్‌లో ఉంది. లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది సుమారు 72 శాతం మంది ప్రొఫెషనల్స్ కొత్త అవకాశాల కోసం చురుగ్గా వెతుకుతున్నారు. 2022 ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో ఉద్యోగానికి వచ్చే అప్లికేషన్ల సంఖ్య ఏకంగా డబుల్ అయింది! మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో స్కిల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల, ఉద్యోగ వేట మరింత కష్టతరంగా మారిందని దాదాపు 76 శాతం మంది భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, సొంత ప్రాంతానికి దగ్గరగా, తక్కువ ఖర్చుతో పీస్‌ఫుల్ లైఫ్‌స్టైల్‌ను, మెరుగైన కెరీర్ (career) ఆపర్చునిటీస్‌ను అందించడంలో వైజాగ్ వంటి నగరాలు యంగ్ ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.
ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
ఈ క్రేజీ ట్రెండ్‌పై లింక్డ్ఇన్ కెరీర్ నిపుణులు నీరజితా బెనర్జీ మాట్లాడుతూ, ఉద్యోగార్థులు ఇకపై కేవలం ట్రెడిషనల్ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా తమ ఆలోచనా పరిధిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. చిన్న నగరాల్లోని సంప్రదాయ పరిశ్రమలకు ఇప్పుడు టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ తోడవుతున్నాయని, కాబట్టి ఏ రంగాల్లో కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయో గమనించి, తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎమర్జింగ్ సిటీస్‌లోనే అద్భుతమైన కెరీర్ రీచ్ సాధించవచ్చని ఆమె స్పష్టం చేశారు.
వైజాగ్ వైబ్స్ విత్ ఏ గ్రేట్ కెరీర్!
పీస్‌ఫుల్ బీచ్ లైఫ్, మెట్రో నగరాలకు తగ్గని వర్క్ కల్చర్, తక్కువ లివింగ్ కాస్ట్… ఇవన్నీ వైజాగ్ సొంతం. ఇండియాలోనే No.1 నాన్-మెట్రో జాబ్ హబ్‌గా నిలిచిన విశాఖపట్నం, రాబోయే రోజుల్లో ఐటీ మరియు టెక్ సెక్టార్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సో, మీరు కూడా మీ నెక్స్ట్ జాబ్ స్విచ్ లేదా కెరీర్ మూవ్ కోసం ఆలోచిస్తుంటే, వైజాగ్ వైపు ఒక లుక్కేయడం పక్కా స్మార్ట్ మూవ్ అవుతుంది!
ఇదీ చదవండి.. రెంటింగ్ ఎకానమీ గురించి తెలియకపోతే మీరు ఔట్ డేటెడ్ అయిపోయినట్టే..!