Home » Ramayana Movie Trailer: రామాయణ ట్రైలర్ పోస్ట్‌పోన్

Ramayana Movie Trailer: రామాయణ ట్రైలర్ పోస్ట్‌పోన్

by TaajaVartha
Ramayana Movie Trailer

Ramayana Movie Trailer: ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘రామాయణ’ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. నితీశ్‌ తివారీ (nithish tiwari) డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు చాలా గ్రాండ్‌గా డ్రాప్ చేద్దామని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. కొత్త ట్రైలర్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని ప్రొడ్యూసర్ నమిత్‌ మల్హోత్రా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇది చదవండి.. భాగ్యశ్రీ బోర్సే బ్యూటిఫుల్ క్లిక్స్

అసలు పోస్ట్‌పోన్ ఎందుకు అయిందో చెప్తూ ప్రొడ్యూసర్ నమిత్‌ మల్హోత్రా ఒక క్లారిటీ ఇచ్చారు. రామాయణాన్ని గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనే తన డ్రీమ్ ఇప్పుడు ‘సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ కాంబోతో సెట్ అయిందని చెప్పారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో చాలా హ్యూజ్ కాన్సెప్ట్‌తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని, అందుకే లాస్ట్ మినిట్‌లో ట్రైలర్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎక్స్‌ప్లేన్ చేశారు. 100 ఏళ్ల ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది పక్కా ప్రౌడ్ మూమెంట్ అని, హాలీవుడ్ మూవీస్‌కి గట్టి కాంపిటీషన్ ఇస్తూ రామాయణ వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతుందని ఆయన ధీమాగా చెప్పారు.

ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే రణ్‌బీర్‌ కపూర్‌ (Ranibir Kapoor) రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, రాకింగ్ స్టార్ యశ్‌ (Yash) రావణుడిగా కనిపించి రచ్చ చేయబోతున్నారు. సుమారు రూ.4,000 కోట్ల మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని టూ పార్ట్స్‌గా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి (Diwali), సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ దీపావళికి థియేటర్లలోకి రానుంది. మొత్తానికి గ్లోబల్ వైడ్ ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00