Palnadu District: దివంగత ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా గురజాలలోని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ — “మండలి వెంకట కృష్ణారావు గారు ప్రజాహితం, సామాజిక సంక్షేమం కోసం విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, సమాజం పట్ల ఉన్నత విలువలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. సమాజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి అంజలి ఘటించి, సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.